సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న 'ఎఫ్ 3'.. రిలీజ్ డేట్ ఇదే

F3 Movie release on Feb 25th 2022.విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఎఫ్ 2

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Oct 2021 10:40 AM GMT
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. రిలీజ్ డేట్ ఇదే

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'ఎఫ్ 2' చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసి నిర్మాత దిల్‌రాజ్‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్‌లు న‌టించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. 'ఎఫ్ 3' పేరుతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా చిత్ర షూటింగ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైన‌ప్ప‌టికి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

ఇక ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌క‌టించినా.. తాజాగా సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుంది. తాజాగా కొత్త విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 25, 2022న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. 'బొమ్మ ఎప్పుడు ప‌డితే.. అప్పుడు మ‌న‌కు న‌వ్వుల పండ‌గే' అంటూ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

కాగా.. 2022 సంక్రాంతి సీజన్ లో నాలుగు పెద్ద చిత్రాలు బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. "ఆర్ఆర్ఆర్" జనవరి 7న, 'భీమ్లా నాయక్' జనవరి 12న, 'సర్కారు వారి పాట' జనవరి 13న, 'రాధే శ్యామ్' జనవరి 14 తేదీల్లో విడుద‌ల కానున్నాయి. దీంతో ఆ స‌మ‌యంలో విడుద‌ల చేయ‌డం చాలా రిస్క్ అని భావించిన నిర్మాత‌లు శివ‌రాత్రికి తీసుకువ‌స్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

Next Story
Share it