న‌వ్వుల పండుగ ఇప్పుడు వేస‌విలో

F3 Movie release on April 29th 2022.విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2021 1:05 PM IST
న‌వ్వుల పండుగ ఇప్పుడు వేస‌విలో

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. 'ఎఫ్ 2'కు సీక్వెల్‌గా మూడు రెట్ల ఫ‌న్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఈ చిత్ర విడుద‌ల రెండు సార్లు వాయిదా ప‌డగా.. తాజాగా మ‌రోసారి వాయిదా ప‌డింది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. అదే రోజు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన 'భీమ్లా నాయ‌క్' చిత్రం విడుద‌ల అవుతుండ‌డంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. దేవీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story