ఆసుప‌త్రిలో బిగ్‌బాస్ కంటెస్టెంట్

Ex-Bigg Boss Kannada Fame Chaitra Kotoor Allegedly Attempts Suicide. కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర‌ కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది.

By Medi Samrat  Published on  13 April 2021 2:41 AM GMT
Bigg Boss Kannada Fame Chaitra Kotoor  suicide attempt

ప్రముఖ కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర‌ కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. 'సుజీదార' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర‌ కోలార్లోని తన ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చనిపోవడానికి ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్ర‌‌స్తుతం చైత్ర‌ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని.. ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఇక‌ చైత్ర ఆత్మహత్యాయత్నానికి కారణాలేంటి అనే విష‌య‌మై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె దగ్గర్నుంచి ఫిర్యాదు కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చైత్ర హాస్పిటల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే.. చైత్ర మార్చి 28, 2021న నాగార్జున అనే బిజినెస్ మ్యాన్ ను ఓ గుడిలో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన రెండు మూడు రోజులకే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని తెలుస్తుంది. చైత్ర‌ను వివాహం చేసుకోవడం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చెయ్యడంతోనే అతను పెళ్లి చేసుకున్నాడని నాగార్జున కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ నాగార్జున వెంట పడటం.. ప్రేమిస్తున్నానని చెప్పడం వల్లే అతడిని చైత్ర పెళ్లి చేసుకుందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.


Next Story