'ఏవో ఏవో కలలే' అంటున్న నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి

Evo Evo Kalale Lyrical song release. తాజా చిత్రం ల‌వ్‌స్టోరీలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2021 3:00 PM IST
Evo Evo Kalale Lyrical song release

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తాజాగా ఈ చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది. ఏవో ఏవో క‌ల‌లే అంటూ సాగుతున్న రిలిక‌ల్ వీడియో సాంగ్‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ మాట్లాడుతూ.. ఈ పాట‌ను లాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

భాస్క‌ర్ భ‌ట్ల రచించిన ఈ పాట‌కి జోనితా గాంధీ, న‌కుల్ అభ్యంక‌ర్ ఆల‌పించారు. సీహెచ్ ప‌వ‌న్ సంగీతాన్ని అందించాడు. శేఖ‌ర్ కొరియోగ్ర‌ఫీలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పుల‌తో అల‌రించారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే విడుద‌లైన సారంగ ద‌రియా సాంగ్ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. సున్నిత‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతోంది.


Next Story