నేటి నుంచే బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6.. కంటెస్టెంట్లు వీళ్లే..! టైటిల్ నాదేనంటున్న రేవంత్‌

Everything is ready for the grand launch of Bigg Boss Season 6.బిగ్‌బాస్ రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2022 8:36 AM IST
నేటి నుంచే బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6.. కంటెస్టెంట్లు వీళ్లే..! టైటిల్ నాదేనంటున్న రేవంత్‌

తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. విజ‌య‌వంతంగా ఐదు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి నుంచి ఆరో సీజ‌న్ మొద‌లుకానుంది. ఆదివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి టెలికాస్ట్ కానుంది. ఈ సారి కూడా నాగార్జున నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓపెనింగ్ ఎపిసోడ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసిన‌ట్లు ప్రోమోల‌ను బ‌ట్టి అర్థ‌మైపోతుంది.

ఇక ఈ సారి షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేన‌ని ఓ లిస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కమెడియన్‌ చంటి,నటుడు బాలాదిత్య, గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప(పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా(ఆర్జీవీ వీడియోతో పాపులర్‌), జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు సాధార‌ణ వ్య‌క్తులు ఉంటార‌ని అంటున్నారు. మ‌రీ ఈ లిస్ట్ నిజ‌మా కాదా..? వీరిలో ఎంత మంది షోలో ఉంటారు..? వంటి విష‌యాలు తెలియాలంటే ఎపిసోడ్ ప్ర‌సారం అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


టైటిట్ గెలిచే వ‌స్తా.. రేవంత్

తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెలుతున్న‌ట్లు సింగ‌ర్ రేవంత్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. 'జీవితంలో కొన్నింటిని త్యాగం చేయడం చాలా కష్టం. నా కుటుంబాన్ని మిస్‌ అవుతాను. ముఖ్యంగా నా భార్య. అలాగే నా సంగీతాన్ని. కానీ ఓ భగీరథుడి సాధనలా గెలిచి మంచి పేరుతో బయటికు వస్తాను. త్వరలోనే మీ అందరి కలుసుకుంటా. ఓటింగ్స్‌ ద్వారా మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి. మీ అందరిని అలరించేందుకు చివరి రంగం సిద్ధమైంది. మీ అందరి ప్రేమ, ఆశ్వీర్వాదంతో టైటిల్‌ గెలిచి వస్తాను' అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజ‌న్లు అత‌డిని విష్ చేస్తున్నారు.


Next Story