ఎవరు మీలో కోటీశ్వరులు.. ప్రోమోలో అదరగొట్టిన ఎన్టీఆర్

Evaru meelo koteeswarulu Promo release.బుల్లితెర‌పై మ‌రోసారి అల‌రించేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ సిద్ద‌మ‌య్యారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 6:47 AM GMT
ఎవరు మీలో కోటీశ్వరులు.. ప్రోమోలో అదరగొట్టిన ఎన్టీఆర్

బుల్లితెర‌పై మ‌రోసారి అల‌రించేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్ సిద్ద‌మ‌య్యారు. ముందు నుంచి ప్ర‌చారం జ‌రిగిన‌ట్లుగానే జెమినీ టీవీ‌లో ప్ర‌సారం కానున్న 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' రియాలిటీ షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా అల‌రించ‌నున్నాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. జెమినీ టీవీ అఫీషియల్‌గా ఎన్టీఆర్ లుక్‌ ప్రమోను శనివారం రిలీజ్ చేశారు. కాగా.. ఈ షో ఎప్పుడు మొదలుకానుంది అనే వివ‌రాలు మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ ప్రోమోలో 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న ప్ర‌త్యేక‌ డైలాగులు అల‌రిస్తున్నాయి.


'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షో ప్రోమోమో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్దం చేసినట్టు ప్రకటించారు. ఇక ఈ షో జెమినీ టీవితో పాటు జెమినీకి చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ లో కూడా ప్రసారం కానుంది. కాగా.. గ‌తంలో ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' తెలుగు సీజ‌న్ 1కు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్ షోను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌డంతో ఎన్టీఆర్ ఎంతో విజ‌య‌వంతం అయ్యారు. ఇప్పుడు మ‌రోసారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఎన్టీఆర్ సిద్ద‌మ‌య్యారు.


Next Story
Share it