ఎన్టీఆర్ హోస్ట్‌గా 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'..!

Evaru Meelo Koteeswarulu official announcement.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ ఉన్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2021 6:09 AM GMT
Evaru Meelo Koteeswarulu official announcement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి బుల్లితెర‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ద‌మైపోయాడు. తెలుగు 'బిగ్‌బాస్' సీజ‌న్ 1కి హోస్ట్‌గా ఎన్టీఆర్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. 'బిగ్‌బాస్' ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసింది ఎన్టీఆరే అన‌డంలో సందేహాం లేదు. తాజాగా మ‌రో స‌రికొత్త రియాలిటీ షోతో ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి అల‌రించేందుకు సిద్ద‌మయ్యాడు ఎన్టీఆర్‌. నాగార్జున హోస్ట్‌గా రూపొందిన 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అనే కార్య‌క్ర‌మాన్ని కొన్ని మార్పుల‌తో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'గా మార్చి జెమినీ టీవీ స‌రికొత్త షో ప్లాన్ చేసింది.

ఈ షోకు హోస్ట్‌గా ఎన్టీఆర్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని కొద్దిసేప‌టి క్రిత‌మే అధికారికంగా తెలియ‌జేశారు. బిగ్గెస్ట్ మోస్ట్ ఎంట‌ర్‌టైనింగ్ షో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ ఓ ప్రోమో విడుద‌ల చేయ‌గా.. హోస్ట్ సీట్‌లో ఎన్టీఆర్‌ని పూర్తిగా రివీల్ చేయ‌కుండా.. షాడో రూపంలో చూపించారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ప్రొమోస్ షూటింగ్స్‌లో పాల్గొన్నాడు. వీటిని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేశాడు. రానున్న రోజుల్లో ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేయ‌డానికి జెమినీ సిద్ద‌మైంది. ఇదిలా ఉంటే.. గ‌తేడాదే ఈ షోని తీసుకురావాల‌ని బావించినా క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ఇక ఈ షో ఒక్కొ ఎపిసోడ్ కోసం కోటికిపైగా రెమ్యున‌రేష‌న్ అందుకోనున్నాడ‌ట ఎన్టీఆర్‌.


Next Story
Share it