కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది అంటున్న ఎన్టీఆర్‌

Evaru meelo koteeswarulu new promo.ఆట నాది కోటి మీది అంటూ ఊరిస్తూ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' టీజర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2021 3:38 PM IST
Evaru meelo koteeswarulu new promo

చక్కని విజ్ఞానం ప్రతిభ ఉండి అవకాశాలు రాని వారెందరో. సంపాదన మార్గం తెలియక పేదరికంలోనే ఉండిపోతారు. అలాంటి వారికి దండీగా డబ్బు సంపాదించుకునే అవకాశం. ఆట నాది కోటి మీది అంటూ ఊరిస్తూ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' టీజర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇటీవల‌ విడుద‌ల చేసిన ఈ షో ప్రోమోలో ఎన్టీఆర్ క‌న‌ప‌డిన విష‌యం తెలిసిందే. బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో మ‌రో ప్రోమోను విడుద‌ల చేశారు. ఇక్కడ 'కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది' అంటూ ఎన్టీఆర్ చెబుతున్న మాట‌లు షో పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి.

కాగా.. ఎన్టీఆర్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 1కి వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. బిగ్‌బాస్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి ఆ షో సూప‌ర్ స‌క్సెస్ కావ‌డానికి ఎన్టీఆర్ త‌న వంతు పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఎంఈకే కి సారూప్యతలు ఉన్న ఇఎంకే(ఎవరు మీలో కోటీశ్వరుడు?) కార్యక్రమంతో టీఆర్పీ వేటలో పడింది సదరు ఎంటర్ టైన్ మెంట్ చానెల్. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ తారక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు మరోసారి అసలు ఈ కార్యక్రమం ఉద్ధేశం ఏంటో తెలియజేస్తూ కొత్త టీజర్ ని రిలీజ్ చేయగా దీనికి అద్భుత స్పందన వస్తోంది.




Next Story