ప్రొమో వ‌చ్చేసింది.. నీ కంటే మీ గురువు గారే నయం

EMK with Mahesh Babu Special Episode Promo Out.బుల్లి తెరపై ప్రసారమౌతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2021 2:40 PM IST
ప్రొమో వ‌చ్చేసింది.. నీ కంటే మీ గురువు గారే నయం

బుల్లి తెరపై ప్రసారమౌతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. తార‌క్‌ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కార్య‌క్ర‌మం మంచి టీఆర్‌పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌, దేవీశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ వంటి సెల‌బ్రెటీలు ఎన్టీఆర్‌తో చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఇక ఈ షోలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా పాల్గొన‌గా.. ఇందుకు సంబంధించిన ప్రొమోను నేడు విడుద‌ల చేశారు.

ఎన్టీఆర్.. వెల్ క‌మ్ టూ మ‌హేష్ అన‌డంతో ఈ ప్రోమో ప్రారంభ‌మైంది. సెట‌ప్ అదిరిపోయింది అని మ‌హేశ్ బాబు కామెంట్ చేయ‌గా.. నా రాజా అంటూ ఎన్టీఆర్ బ‌దులు ఇచ్చాడు. ఇక మ‌హేష్‌బాబు చెప్పిన స‌మాధాన్ని పై ఎన్టీఆర్ కాస్త తిక‌మ‌క పెట్ట‌డంతో.. నీకంటే మీ గురువు(కంప్యూట‌ర్‌) గారే నయం అంటూ మ‌హేష్ బాబు అన‌డంతో ప్రొమో ఎండ్ అయ్యింది. ఒకే ఫ్రేమ్‌లో అటు ఎన్టీఆర్ ఇటు మ‌హేష్ బాబు క‌నిపించేస‌రికి చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌టం లేద‌ని అంటున్నారు అభిమానులు. ఇక పుల్ ఎపిసోడ్ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రొమో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story