హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు

ED Notice to Rakul Preet Singh in Drug case. టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ షాకిచ్చింది. తాజాగా రకుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌

By అంజి  Published on  16 Dec 2022 2:12 PM IST
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ షాకిచ్చింది. తాజాగా రకుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు పంపింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఈడీ అధికారులు.. డ్రగ్స్‌ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. డిసెంబర్‌ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఇక కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది. ఈ కేసులో గత సంవత్సరం సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ విచారించింది. అయితే అప్పుడు అర్జెంట్‌గా ఏదో పని ఉందని చెప్పి విచారణలో మధ్యలోనే వెళ్లిపోయింది రకుల్‌.

దీంతో అప్పుడు పూర్తి స్థాయిలో రకుల్‌ను అధికారులు విచారించలేకపోయారు. ఈ క్రమంలోనే రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై 2017 జులైలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఆ తర్వాత సిట్‌ను ఏర్పాటు చేసి పలువురు సినీ సెలబ్రిటీలను విచారించారు. ఆ తర్వాత మనీలాండరింగ్‌ కింద ఈ కేసును ఈడీ అధికారులు టేకోవర్‌ చేశారు. గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించింది.

Next Story