1xBet బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఆమె సెప్టెంబర్ 16న ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి కూడా సెప్టెంబర్ 15న హాజరు కావాలంటూ ED సమన్లు జారీ చేసింది.
"1xBet యాప్ కేసులో ఇద్దరినీ ED కార్యాలయంలో హాజరు కావాలని కోరినట్లు" ED వర్గాలు ధృవీకరించాయి. దర్యాప్తులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ సహా పలువురు సెలెబ్రిటీలను అధికారులు ప్రశ్నించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది.