కరోనా బారిన పడిన మరో స్టార్ హీరో
Dulquer Salmaan tests positive for coronavirus.కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సామాన్యులు
By తోట వంశీ కుమార్ Published on 21 Jan 2022 11:17 AM ISTకరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమమారి బారీన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ నటులకు కరోనా సోకగా.. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వల్పలక్షాణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ కరోనా నిబంధనలు పాటించండి' అంటూ దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు.. త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
మళయాళంలో స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. దివంగత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'మహానటి' సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించారు. ఆయన నటించిన పలుచిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయి విజయాన్ని సాధించాయి. కాగా.. రెండు రోజుల క్రితం ఆయన తండ్రి, సీనియర్ నటుడు మమ్ముట్టి కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.