సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. డబ్బింగ్ రంగంలో ఎన్నో ఏళ్లు ఆయన సేవలందించారు. సూర్య, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ నటులు, నెటీజన్లు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
పాత్రకు తగ్గట్లు వేరియేషన్, ఎమోషనల్ సీన్లలో తన గొంతుతోనే ఆ సీన్ మొత్తాన్ని నడిపించడం చేశారు. ప్రతి పాత్రకు ఒక్కొ వేరియేషన్‌లో ఆయన డబ్బింగ్ చెప్పేవారు. ఫలానా పాత్రను డబ్బింగ్ చెప్పింది తానేనని చెప్పే వరకు ప్రేక్షకుల కూడా కనుక్కోలేరు. అంతలా పాత్ర పాత్రకు డబ్బింగ్‌లో వేరియేషన్లు చూపించేవారు. అలాంటి డబ్బింగ్ ఆర్టిస్టు ఇక లేరు.