ఉత్కంఠ‌భ‌రితంగా 'దృశ్యం-2' టీజ‌ర్

Drushyam 2 movie teaser release.విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన దృశ్యం సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 9:22 AM GMT
ఉత్కంఠ‌భ‌రితంగా దృశ్యం-2 టీజ‌ర్

విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన 'దృశ్యం' సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'దృశ్యం-2' చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌ల‌యాళ చిత్రం 'దృశం-2 'చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జోసెఫ్ జీతూనే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాంబాబు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి పాత్ర‌లో వెంక‌టేశ్ క‌నిపించ‌నుండ‌గా.. ఆయ‌న భార్య‌గా మీనా క‌నిపించ‌నుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. థియేట‌ర్లలో విడుద‌ల అవుతుందా..? లేదా ఓటీటీలో విడుద‌ల అవుతుందా..? అన్న అనుమానుల‌కు తెర‌దించుతూ.. అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

న‌వంబ‌ర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర‌బృందం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. 'ఇంత‌కు ముందు ఎన్నో స‌మ‌స్య‌లొచ్చాయి, పోయాయి ఇది కూడా అలాగే పోతుంది' అని వెంక‌టేశ్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంది. చివ‌ర‌కు ఈ కేసును పోలీసులు ఛేదిస్తారా? కేసు నుంచి వెంక‌టేశ్ కుటుంబం త‌ప్పించుకుంటుందా? అన్న ఆస‌క్తిని టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల్లో నింపారు.

Next Story
Share it