ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా దోస్తీ సాంగ్ వ‌చ్చేసింది

Dosti song release from RRR.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 11:18 AM IST
ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా దోస్తీ సాంగ్ వ‌చ్చేసింది

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. కాగా.. నేడు స్నేహితుల దినోత్స‌వాన్నిపురస్క‌రించుకుని దోస్తీ సాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో ఈ పాట‌ను హేమ‌చంద్ర‌, త‌మిళంలో అనిరుద్‌, హిందీలో అమిత్ త్రివేది, క‌న్న‌డ‌లో యాజిన్ నైజ‌ర్, త‌మిళంలో విజ‌య్ ఏసుదాస్ మ‌ల‌యాలంలో పాడారు. ఐదు బాష‌ల్లో ఐదుగురు సంగీత యువ కెర‌టాలు పాడిన ఈ పాట ఎంతో ఆకట్టుకునేలా ఉంది. చిత్రంలో ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ స్నేహానికి ప్ర‌తీక‌గా ఈ పాట‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా తార‌క్ న‌టిస్తున్నారు. అలియాభ‌ట్, ఒలీవియా మోరీస్, రేయ్ స్టీవ్‌స‌న్‌, శ్రియ‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి దోస్తీ పాట‌ను వినేయండి.

Next Story