కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటో తెలుసా..?
Do you know the name of Kajal Aggarwal Son.టాలీవుడ్ చందమామ కాజర్ అగర్వాల్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని
By తోట వంశీ కుమార్ Published on 20 April 2022 9:02 AM GMT
టాలీవుడ్ చందమామ కాజర్ అగర్వాల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాజల్ భర్త గౌతమ్ కిచ్లు, సోదరి నిషా అగర్వాల్ లు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు. ఈ సందర్భంగా కాజల్ దంపతులకు అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారు. పరిచయస్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్.. తన కుమారుడికి ఏ పేరు పెడుతారోనని అభిమానులు ఎదురుచూస్తుండగా.. కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఈ విషయాన్ని చెప్పేసింది.
బాబు పేరు 'నీల్ కిచ్లు' అని తెలిపింది నిషా. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇక ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ భర్త గౌతమ్ కిచ్లు కూడా చెప్పాడు. కాగా.. తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. అప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోలను, భర్త గౌతమ్ తో కలిసి దిగిన బేబీబంప్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ 'ఆచార్య' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.