ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది

By Medi Samrat  Published on  19 April 2024 6:15 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న డీజే టిల్లు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ సెన్సేషన్‌గా మారింది. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. టాప్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ నెలలో ఈ చిత్రం తన ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది.

ఈ చిత్రాన్ని త్వరలో OTTలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ కూడా వచ్చింది. ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి.. అట్లుంటది టిల్లుతోని అంటూ నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. డీజే టిల్లుకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

Next Story