ఇగ 'డీజే టిల్లు'గాడి లొల్లి ఆహాలో.. ఎప్పటినుండంటే.!

‘DJ Tillu’ gets tentative OTT release. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘డీజే టిల్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ‘డీజే టిల్లు’

By అంజి  Published on  27 Feb 2022 10:32 AM IST
ఇగ డీజే టిల్లుగాడి లొల్లి ఆహాలో.. ఎప్పటినుండంటే.!

ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'డీజే టిల్లు' సినిమా ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. 'డీజే టిల్లు' నిర్మాతలు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. 'డీజే టిల్లు' సినిమా ఓటీటీ విడుదల ప్రకటన ఉన్నప్పటికీ.. మేకర్స్ ఖచ్చితమైన తేదీని విడుదల చేయలేదు. ఓటీటీ విడుదలను ప్రకటిస్తూ.. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహాలో 'త్వరలో వస్తుంది' అని రాసింది. ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శింపబడుతుండగా, మార్చిలో ఎప్పుడైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

తెలిసిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా మార్చి 10న ఆహాలో విడుదల కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన 'డిజె టిల్లు' సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ అందుకుంది. మంచి సమీక్షలతో గొప్ప థియేట్రికల్ వసూళ్లను నమోదు చేసింది. 'డిజె టిల్లు' సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను నిర్మించారు. ఇది కొత్త యుగం కథాంశంతో సరైన కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. సినిమా విజయవంతం కావడంతో సీక్వెల్‌ తెరకెక్కించాలనుకుంటున్నారు నిర్మాతలు.


Next Story