యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం

Diya fame Prithvi Ambaar mother passed away.క‌న్న‌డ యంగ్ హీరో, ‘దియా’ ఫేం పృథ్వీ అంబ‌ర్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2022 12:55 PM IST
యంగ్ హీరో ఇంట తీవ్ర విషాదం

క‌న్న‌డ యంగ్ హీరో, 'దియా' ఫేం పృథ్వీ అంబ‌ర్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. పృథ్వీ త‌ల్లి సుజాత క‌న్నుమూసింది. గ‌త కొంత‌కాలంగా హృద‌య సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం ఆమె తుది శ్వాస విడిచింది. త‌ల్లి మరణంతో పృథ్వీ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆమె అంత్య‌క్రియ‌లు వారి స్వ‌గ్రామంలో జ‌ర‌గ‌నున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆమె మృతి ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.


2008లో 'రాథా కల్యాణ' సీరియల్‌తో నటుడిగా పరిచమైన పృథ్వీ అంబ‌ర్ ఆ తరువాత 'జోతే జోతేయాలి'తో పాటు ప‌లు సీరియ‌ల్స్ ద్వారా క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు చేరువ అయ్యాడు. క్ర‌మంలో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ 2020లో వ‌చ్చిన దియా చిత్రంతో హీరో మారాడు. ఈ చిత్రం క‌న్న‌డ నాట ఘ‌న విజ‌యం సాధించ‌డంతో తెలుగులోనూ అదే పేరుతో విడుద‌ల చేశారు.


Next Story