పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరి హర వీరమల్లు సినిమా విడుదలకు పలు అవంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)లో ఫిర్యాదు అందింది. ఏఎం రత్నం, తన గత చిత్రాలైన ‘ఆక్సిజన్’, ‘బంగారం’, ‘ముద్దుల కొడుకు’ సినిమాలకు సంబంధించిన బకాయిలను చెల్లించలేదని రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆరోపించాయి.
ఎంఎస్ ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ‘ఆక్సిజన్’ సినిమా కోసం ఇచ్చిన 2.6 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసింది. నిర్మాత ఏఎం రత్నం దీనిపై స్పందించాల్సి ఉంది. ఏఎం రత్నం నిర్మాతగా పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ భారీ చిత్రం జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలో ఈ వివాదాలు సినిమాను వెంటాడుతూ ఉన్నాయి.