వివాదంలో 'కశ్మీర్ ఫైల్స్' చిత్ర‌ దర్శకుడు

Director Vivek Agnihotri Controversial Comments on Bhopali.‘ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2022 11:29 AM IST
వివాదంలో కశ్మీర్ ఫైల్స్ చిత్ర‌ దర్శకుడు

'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్నాడు ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి. అయితే.. ఆయ‌న వివాదంలో చిక్కుకున్నారు. భోపాలీల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో ఆయ‌న మాట్లాడుతూ భోపాలీ అంటే హోమో సెక్స్‌వల్ అని అర్థ‌మంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై పలువురు రాజకీయ నేతలు, భోపాలీ ప్రజలు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌లో వివేక్ అగ్నిహోత్రి ఓ ఆన్‌లైన్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయింది. అందులో.. 'నేను భోపాల్‌కు చెందిన వాడిని. కానీ.. ఎక్కడా ఈ విషయాన్ని చెప్పను. ఎందుకంటే భోపాలీలు అంతా హోమో సెక్సువల్స్‌లా వ్యవహరిస్తుంటారు. వారు నవాబుల ప్రవర్తన కలిగి ఉంటారు' అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. దీనిపై వివాదం చెల‌రేగుతోంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదన్నారు.

Next Story