పుష్ప క్లైమాక్స్‌పై సుకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 'బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌నుకున్నా'

Director Sukumar shocking Comments on Pushpa Movie climax.ఐకాన్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం పుష్ప ది రైజ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Dec 2021 2:36 PM IST
పుష్ప క్లైమాక్స్‌పై సుకుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌నుకున్నా

ఐకాన్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం 'పుష్ప ది రైజ్‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టింది. పుష్ప రాజ్ పాత్ర‌లో బ‌న్ని ఇర‌గ‌దీశాడు. అయితే.. ఈ చిత్ర క్లైమాక్స్‌పై ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. క్లైమాక్స్‌లో ఫహద్‌ ఫాజిల్, అల్లు అర్జున్‌లు ఇద్ద‌రూ అర్థ‌న‌గ్నంగా క‌నిపిస్తారు. ఆ సీన్ అంత‌లా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

నిజానికి క్లైమాక్స్ లో బ‌న్నీ, ఫ‌హాద్ ఇద్ద‌రిని న్యూడ్‌గా చూపించాల‌ని అనుకున్న‌ట్లు తెలిపారు. 'అలాగే క‌థ రాసుకున్నా. అయితే ఆఖ‌రి నిమిషంలో ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గా. ఎందుకంటే తెలుగు ప్రేక్ష‌కులు ఇలాంటి సన్నివేశాలు అంగీక‌రించ‌ర‌ని తెలిసి అప్ప‌టిక‌ప్పుడు మార్పులు చేశా.' అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక తొలి భాగంలో కేవ‌లం పాత్ర‌లను ప‌రిచ‌యం మాత్రమే చేశామ‌ని, అస‌లు క‌థ మొత్తం సెకండ్ పార్ట్‌లో ఉంటుంద‌ని చెప్పాడు. తొలి భాగాన్ని మించి రెండో భాగంలో స‌న్నివేశాలు ఉంటాయ‌ని చిత్ర బృందం చెబుతోంది. మ‌రీ ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటాయో చూడాలి. ఇదిలా ఉంటే.. క్లైమాక్స్‌లో బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌ని అనుకున్న‌ట్లు సుకుమార్ చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Next Story