ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం

Director Srinu Vaitla Father passed away.టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం నెల‌కొంది. గ‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 8:35 AM IST
ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న శ్రీనువైట్ల తండ్రి కృష్ణారావు ఆదివారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయ‌న స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా కందుల‌పాలెం. అక్క‌డే ఆయ‌న నివ‌సిస్తున్నారు. గ‌త‌ కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుండ‌గా.. కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించి నేటి తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విష‌యం తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శ్రీను వైట్ల‌కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. దూకుడు, బాద్ షా వంటి చిత్రాల‌తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ల‌ను ఇచ్చిన శ్రీనువైట్ల‌కు గ‌త కొంత‌కాలంగా స‌రైన స‌క్సెస్ ద‌క్క‌డం లేదు. ఇటీవ‌ల ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోతున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మంచు విష్ణు హీరోగా ఢీ అంటే ఢీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. 2007లో వ‌చ్చిన ఢీ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

Next Story