ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఇంట విషాదం

Director Singeetham Srinivasa Rao wife Lakshmi Kalyani passed away.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఇంట విషాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2022 4:40 AM GMT
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఇంట విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీ క‌ల్యాణి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని సింగీతం తెలియ‌జేశారు. 'నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది' అని సింగీతం తెలియ‌జేశారు. ఆమె అంత్య‌క్రియ‌లు ఆదివారం జ‌ర‌గ‌నున్నాయి. సింగీతం సతీమణి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

సింగీతం శ్రీనివాసరావు 1960లో లక్ష్మీకల్యాణి ని వివాహాం చేసుకున్నారు. సింగీతం సినీ కెరీర్‌లో ఆమె కీల‌క పాత్ర వ‌హించారు. సినిమా స్క్రిప్ట్‌ రాయడంలో ఆయనకు సహాయం చేసేశారు. త‌న జీవిత ప్ర‌యాణం గురించి తెలియ‌జేస్తూ ఆమె 'శ్రీ క‌ల్యాణీయం' అనే పుస్త‌కాన్ని రాశారు. అందులో దంప‌తుల మ‌ధ్య ప్రేమ‌ను చాటి చెప్పారు. ప్రస్తుతం సింగీతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభాస్‌ నటించబోతున్న తాజా చిత్రం 'ప్రాజెక్ట్‌ కే' చిత్రానికి తొలుత కన్సల్టెంట్ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు కానీ ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు.

Next Story
Share it