షూటింగ్‌లో గాయ‌ప‌డిన స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. స్పందించిన ద‌ర్శ‌కుడు

Director Shiva Nirvana Clarity on Samantha and Vijay Deverakonda injured news.యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2022 5:26 AM GMT
షూటింగ్‌లో గాయ‌ప‌డిన స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. స్పందించిన ద‌ర్శ‌కుడు

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. మ‌జిలి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది. విజ‌య్‌, స‌మంత కాంబినేష‌న్‌లో రానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవలే కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు చేరుకుంది చిత్ర బృందం.

ఇదిలా ఉంటే.. కాశ్మీర్ లో షూటింగ్ చేస్తున్న క్ర‌మంలో విజ‌య్‌ దేవరకొండ, సమంత గాయ‌ప‌డ్డార‌ని వార్త‌లు వైర‌ల్‌గా మారాయి. కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో లిడ్డర్ నదిపై తాడుతో నిర్మించిన వంతెనపై నుంచి వాహనాన్ని న‌డుపుతున్న సీన్ చేస్తున్న‌ప్పుడు వాహ‌నం అదుపు త‌ప్పి నీటిలో ప‌డ‌డంతో స‌మంత‌, విజ‌య్ కు గాయాల‌య్యాయ‌ని, వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. దీంతో విజ‌య్‌, స‌మంత కు ఏమైందోన‌ని అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు స్పందించారు. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్ చేశాడు.

అటు పీఆర్‌ టీమ్‌ సైతం ఈ వార్తలను ఖండించింది. `ఖుషి` సినిమా షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ, సమంతలకు గాయాలు అయినట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అవాస్తవాలను నమ్మొద్దంటూ చెప్పింది. 30 రోజులు కాశ్మీర్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుని సోమవారమే హైదరాబాద్‌ వచ్చినట్టు తెలిపింది. త్వ‌ర‌లోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభం కానుంద‌ని తెలిపింది.

ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లర్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెర‌కెక్కుతోంది. ఈచిత్రం డిసెంబర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it