ధనుష్-ఐశ్వర్య విడాకులు.. రాంగోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

Director Ram Gopal Varma tweets regarding Dhanush and aishwarya divorce.పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు పెద్ద‌లు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2022 12:51 PM IST
ధనుష్-ఐశ్వర్య విడాకులు.. రాంగోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు పెద్ద‌లు. ఒక‌ప్పుడు వివాహం చేసుకున్న జంట‌లు ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా.. ఒక‌రికి ఒక‌రు తోడుగా ఉంటూ క‌లిసి జీవించారు. అయితే.. ఇప్పుడు కార‌ణాలు ఏవైనా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ అని ప‌రిశ్ర‌మ‌ల‌తో సంబంధం లేకుండా ఇటీవ‌ల విడాకులు తీసుకున్న సినీ సెల‌బ్రెటీల సంఖ్య త‌క్కువేం కాదు. బాలీవుడ్‌లో అమీర్ జంట‌, టాలీవుడ్‌లో అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత‌, త‌మిళ్‌లో న‌టి అమ‌లాపాల్‌-ద‌ర్శ‌కుడు విజ‌య్ త‌దిత‌రులు విడాకులు తీసుకున్నారు. తాజాగా కోలీవుడ్‌లో స్టార్ హీరో ధ‌నుష్‌, ర‌జినీకాంత్ కుమారై ఐశ్వ‌ర్య జంట విడిపోతున్న‌ట్లు ప్ర‌కటించారు. దీనిపై ఎవ‌రికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక పెళ్లిని తీవ్రంగా వ్య‌తిరేకించే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు.

'పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌' అని ఆర్జీవీ ట్వీటాడు.

'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం. స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు. వివాహం అనేది బాధని, హ్యాపినెస్ లేకపోవడాన్ని నిరంతర చక్రంగా ఉంచడానికి మన దుష్ట పూర్వీకులు కనిపెట్టారు. వివాహంలో ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. వివాహం తర్వాత 3 నుండి 5 రోజుల వరకు ఆ ప్రేమ ఉంటుంది అంతే. పెళ్లి కంటే వేగంగా ప్రేమించే హత్యలు ఏవీ లేవు. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యం. తెలివైన వ్యక్తులు ప్రేమిస్తారు. తెలివి తక్కువ వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. విడాకులు మాత్రమే సంగీత్‌తో జరుపుకోవాలి. ఒకరి ప్రమాదకర లక్షణాలను మరొకరు తెలుసుకునే వివాహ ప్రక్రియ నిశ్శబ్దంగా జరగాలి ' అంటూ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశాడు.


Next Story