కొడాలి నాని ఎవ‌రో నాకు తెలీదు : రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Director Ram Gopal Varma setair on Kodali Nani.ఏపీలో టికెట్ ధ‌రల త‌గ్గింపు పై అటు ఏపీ ప్ర‌భుత్వానికి ఇటు టాలీవుడ్ చిత్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 3:24 PM IST
కొడాలి నాని ఎవ‌రో నాకు తెలీదు : రామ్‌గోపాల్ వ‌ర్మ‌

ఏపీలో టికెట్ ధ‌రల త‌గ్గింపు పై అటు ఏపీ ప్ర‌భుత్వానికి ఇటు టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది. ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిలుస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మండిప‌డుతూ మాట్లాడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో నిన్న మంత్రి పేర్ని నానికి కౌంట‌ర్ ఇచ్చిన వ‌ర్మ ఈ రోజు మ‌రో మంత్రి కొడాలి నానికి త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగా స‌మాధానం ఇచ్చాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యంపై నేను ప్ర‌భుత్వానికి అడిగిన‌ ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ ఒక్కడే.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు." అంటూ వ‌ర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


టికెట్ ధ‌ర‌లు నియంత్రించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వానికి ఏం అధికారం ఉంద‌ని మంగ‌ళ‌వారం రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌శ్నించారు. దీనిపై పౌర స‌ర‌ఫరాల శాఖ మంత్రి కొడాని నాని స్పందిస్తూ.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంద‌న్నారు. ప్ర‌జ‌లే మాకు ఈ అధికారాన్ని ఇచ్చార‌ని.. పక్క రాష్ట్రంలో కూర్చొని అక్క‌డ సినిమాలు తీసుకుంటున్న వ్య‌క్తుల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌ల‌కే జ‌వాబుదారీత‌నంగా ఉంటామ‌ని, రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితులు తెలిసే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. సినిమా టికెట్ ధ‌ర‌లు ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని వ్యాఖ్య‌లు చేస్తున్నారు క‌దా వాళ్ల‌నే అమ్ముకోమ‌ని చెప్పండి.. చూద్దాం అంటూ మంత్రి ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఆర్జీవీ నేడు స్పందించాడు.

Next Story