ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై సినీపరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య మాటలు యుద్దం కొనసాగుతుండగా.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీతో వివాదం మరింత ముదిరింది. ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలపై వర్మ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందుకు మంత్రులు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ వదలని వర్మ సోషల్ మీడియా వేదికగా పది లాజికల్ ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటరిచ్చారు. అనంతరం అందరూ కోరుకుంటున్నట్లుగా ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని సోషల్ మీడియాలో వార్ చెక్ పెట్టేశాడు.
ఇక వర్మ సైలెంట్ అయ్యాడు అని అనుకుంటున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. "వైసీపీలో నేను నమ్మే ఒకే ఒక వక్తి సీఎం జగన్. అయితే.. ఆయన చుట్టూ ఉన్న వైసీపీ లీడర్స్ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ పర్సనల్ ఉపయోగాల కోసం, అజెండా కోసం జగన్‌ను తప్పుగా చూపిస్తున్నారు. హే జగన్.. నీ చుట్టూ ఉన్న డేంజరస్ పీపుల్‌తో జాగ్రత్తగా ఉండు" అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఏపీ రాజకీయాల్లో వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.