రామ్‌గోపాల్ వ‌ర్మ ఇంట్లో విషాదం

Director Ram Gopal varma cousin brother passed away. తాజాగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కు వ‌రుస‌కు సోద‌రుడు అయిన పి.సోమ‌శేఖ‌ర్ ఆదివారం క‌రోనాతో క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2021 7:41 AM IST
Ram Gopal Varma

క‌రోనా విల‌యం కొన‌సాగుతూనే ఉంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడా లేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది సినీ ప్ర‌ముఖులు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. తాజాగా ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కు వ‌రుస‌కు సోద‌రుడు అయిన పి.సోమ‌శేఖ‌ర్ ఆదివారం క‌రోనాతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట్లో విషాదం నెల‌కొంది.


కొద్ది రోజుల క్రితం సోమశేఖ‌ర్‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సోకింది. దీంతో ఆయ‌న్ను హైద‌ర‌బాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ.. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం క‌న్నుమూశారు. ఆయ‌న ప‌లు బాలీవుడ్ చిత్రాల‌కు ప‌ని చేశారు. 'ముస్కురాకే దేఖ్‌ జరా' అనే మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయ‌న.. రంగీలా, దౌడ్‌‌, సత్య, జంగిల్‌, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటూ.. సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. అప్ప‌టి నుంచి వ‌ర్మ కూడా దూరంగా ఉంటున్నారు. కాగా.. త‌న జీవితంలో కీల‌క‌మైన వ్య‌క్తుల్లో సోమ‌శేఖ‌ర్ ఒక‌రని రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాడు. ఇక సోమ‌శేఖ‌ర్ మృతి ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.




Next Story