ఆదిపురుష్ టీజర్‌పై ట్రోలింగ్.. వర్మ ఏమన్నాడంటే
Director Ram Gopal Varma comments on Adipurush Trolling.రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2022 4:58 PM ISTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. దసరా సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. అయితే.. పలువురు సినీ, రాజకీయ నాయకులతో పాటు నెటీజన్ల నుంచి చిత్రబృందం విమర్శలు ఎదుర్కొంటోంది. రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంలోని నటీనటుల వేషధారణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ టీజర్, ట్రోలింగ్‌పై స్పందించాడు.
రామాయణం అంటే ఇలా ఉంటుంది. రాముడు అంటే ఇలా ఉంటాడు అని మనకు ఓ ఆలోచన ఉంది. అయితే.. మన ఆలోచనలకు భిన్నంగా ఉండేసరికి పలువురు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి తనకు సైఫ్ అలీ ఖాన్ లుక్ నచ్చలేదని చెప్పాడు. రావణుడిగా పొడవాటి జుట్టు, భారీ ఆకారం, గంభీరమైన చూపులతో ఎస్వీ రంగారావును చూడ్డానికి అలవాటుపడ్డానని తెలిపాడు. టీజర్‌లో సైఫ్‌ను చూసిన తరువాత కొంచెం బాధపడ్డా. నాకు ఓ నిర్మాత ఫోన్ చేసి ఆదిపురుష్ చిత్రంలో రాముడేంటి మీసాలతో ఉన్నాడు అని అడిగాడు. అయితే.. రాముడిని మీసాలతో ఎందుకు చూపించకూడదన్నది చిత్రబృందం ఆలోచన అయ్యుంటుందని అనుకుంటున్నా.
దర్శక నిర్మాతలు అన్ని కోట్లు పెట్టి చిత్రాన్ని చేశారంటే వాళ్లు కొత్తగా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. ఒక వేళ వాళ్ల ఆలోచన తప్పు అయితే వాళ్లే అనుభవిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏదైనా చేసే హక్కు ఉంది. వాళ్లకు నచ్చినట్లుగా వాళ్లు తీశారు. నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు. అంతేగానీ ట్రోల్స్ చేయడం సరికాదని వర్మ చెప్పాడు.
ఇప్పటి వరకు మీరు చూసిన రీతిలో కాకుండా కాస్త భిన్నంగా రామాయణాన్ని చూపించబోతున్నాం అని చిత్ర బృందం ముందే చెప్పి ఉంటే బాగుందేది. అప్పుడు ఈ స్థాయిలో ట్రోలింగ్ వచ్చేది కాదు. అలా చెప్పకపోవడంతోనే ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీజర్ చూశాక ఏదో యూనిమేటెడ్ ఫిల్మ్‌లా అనిపిస్తోంది. పాత్రల్లో సహజత్వం కనిపించడం లేదు. మరి సినిమా కూడా ఇలాగే ఉంటుందా..? లేదా అన్నది సినిమా విడుదలైన తరువాతనే తెలుస్తోంది వర్మ అన్నాడు.