ఢిల్లీ విమానాశ్రయంలోని ప‌రిస్థితుల‌పై రాజ‌మౌళి ట్వీట్‌..

Director Rajamouli tweets about the situation at the Delhi airport.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి సోష‌ల్ మీడియాలో పెట్టిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 5:32 AM GMT
ఢిల్లీ విమానాశ్రయంలోని ప‌రిస్థితుల‌పై రాజ‌మౌళి ట్వీట్‌..

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను త‌న ట్వీట్ ద్వారా తెలియ‌జేయ‌డంతో పాటు, భార‌త దేశ ప్ర‌తిష్ఠ కోసం వాటిపై దృష్టి పెట్టాల‌ని కోరారు. ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగిన ఆయ‌న.. అక్క‌డ త‌న‌కు ఎద‌రైన అనుభ‌వాన్ని పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారగా.. నెటీజ‌న్తు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

డియ‌ర్ ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. అర్థరాత్రి ఒంటి గంటకు లుఫ్తాన్తా విమానంలో దిగాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. అందరు ప్యాసింజర్లూ దరఖాస్తులను గోడకు ఆనించి, మరికొందరు కింద కూర్చుని వాటిని పూర్తి చేస్తున్నారు. ఇదేమీ నాకు బాగా అనిపించలేదు. దరఖాస్తులను పూరించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇక్కడ నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమిటంటే.. బయటకు రాగానే ఎన్నో వీధి కుక్కలు కనిపించాయి. ఇది తొలిసారిగా భారత్ కు వచ్చే విదేశీయులకు మన దేశంపై మంచి అభిప్రాయాన్ని కలిగించబోదు. ఈ విషయాన్ని అధికారులు దయచేసి పరిశీలించాలి. థ్యాంక్యూ" అని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. రెండు పాట‌లు మిన‌హా మిగ‌తా షూటింగ్ పూర్తి అయిన‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story