ఈ కారణంగానే.. 'నాటు నాటు' సాంగ్‌ను భారత్‌లో చిత్రీకరించలేదట.!

'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' రాబోయే ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డుకు ఎంపికైంది. ఈ పాట విడుదలైనప్పటి నుండి

By అంజి  Published on  10 March 2023 3:02 PM IST
Rajamouli, Naatu Naatu, RRR

ఈ కారణంగానే.. 'నాటు నాటు' సాంగ్‌ను భారత్‌లో చిత్రీకరించలేదట.!

'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని 'నాటు నాటు' రాబోయే ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డుకు ఎంపికైంది. ఈ పాట విడుదలైనప్పటి నుండి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన విషయం అందరికీ తెలిసింది. బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. ప్రపంచవ్యాప్తంగా ఘన కీర్తిని సంపాదించుకుంది. ఇటీవల 'నాటు నాటు' ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. కూర్పు, సాహిత్యంతో పాటు 'నాటు నాటు' దాని అందమైన కొరియోగ్రఫీ, చిత్రీకరణకు కూడా ప్రసిద్ధి చెందింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పర్ఫెక్ట్-సింక్డ్ డ్యాన్స్ స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక దర్శకుడు రాజమౌళి ఈ పాటను రంగుల లొకేషన్‌లో చిత్రీకరించడం ద్వారా మరింత అందంగా చూపించాడు .

కైవ్‌లో ఉన్న ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో నాటు నాటు సాంగ్‌ చిత్రీకరణ జరిగింది. నిజానికి దీన్ని భారత్‌లో చిత్రీకరించాల్సి ఉంది. కానీ మేకర్స్ ఈ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు.. భారతదేశంలో వర్షాకాలం నడుస్తోంది. బహిరంగ ప్రదేశంలో 'నాటు నాటు' సాంగ్‌ షూట్‌ చేయాలి. అయితే వర్షాకాలంలో బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేయడం ప్రమాదకర ప్రక్రియ. దీంతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలను వెతకడం చేయడం ప్రారంభించాడు. అతను ఉక్రెయిన్‌లోని ఒక ప్రదేశాన్ని ఇష్టపడ్డాడు, కానీ అది అధ్యక్ష భవనం అని తరువాత తెలుసుకున్నాడు.

ప్యాలెస్ ఆవరణలో షూట్ చేయడానికి అనుమతి లభించదని భావించాడు. అయితే ఉక్రెయిన్ నిర్మాణ బృందం అనుమతులను క్రమబద్ధీకరించింది. రాజమౌళి కోరుకున్న ప్రదేశంలో 'నాటు నాటు' చిత్రీకరణలో సహాయం చేసింది. ఫలితం అద్భుతమైన కూర్పు, నృత్య కదలికలు, చిత్రీకరణతో అద్భుతమైన పాటగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి బయటకు వచ్చింది. ఇక నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కీరవాణి మ్యూజిక్‌ అందించారు.

Next Story