దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం..
Director Raghavendra rao borther krishna mohan rao passed away. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, ప్రముఖ నిర్మాత, ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన రావు కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on
24 March 2021 9:27 AM GMT

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత, ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన రావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. రేపు ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Next Story