ఎన్టీఆర్ 31.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్

Director Prashanth Neel gives update on NTR 31.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Aug 2022 6:17 AM IST
ఎన్టీఆర్ 31.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్ర‌శాంత్ నీల్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, 'కేజీఎఫ్ ఫేమ్' ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు అన్న సంగ‌తి తెలిసిందే. #NTR31(వ‌ర్కింగ్ టైటిల్‌) తో ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నాటి నుంచి అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. కానీ.. ప్ర‌క‌ట‌న వెలువ‌డి చాలా రోజులు అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్‌లు రాలేదు. అయితే.. తాజాగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఓ అప్‌డేట్ ఇచ్చారు.

అనంత‌రపురం జిల్లాలోని నీల‌కంఠాపురంలోని ఓ దేవాల‌యాన్ని సోమ‌వారం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శించుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. NTR31 గురించి ఏదైనా చెప్పండి అని ఓ విలేక‌రి ప్ర‌శాంత్ నీల్ ని అడిగారు. ఏం చెప్పాలి..? క‌థ చెప్పాలా..? అంటూ అక్క‌డ న‌వ్వులు పూయించాడు. సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వ‌మ‌ని అడుగ్గా.. ఈ చిత్ర షూటింగ్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల‌లో మొద‌లు కానున్న‌ట్లు చెప్పాడు.

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్' చిత్ర ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నారు. శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక 'ఆర్ఆర్ఆర్' తో భారీ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు.

Next Story