కరోనాతో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మృతి
Director Nandyala Ravi passed away with corona. తాజాగా ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన నంద్యాల రవి శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుముశారు.
By తోట వంశీ కుమార్ Published on
14 May 2021 8:00 AM GMT

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది నటీ, నటులు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. కొద్ది మంది కోలుకోగా.. మరికొందరు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, రచయిత అయిన నంద్యాల రవి శుక్రవారం ఉదయం కరోనాతో కన్నుముశారు. ఆయన వయస్సు 42 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
శుక్రవారం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 'నేనూ సీతామహాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు' వంటి చిత్రాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకుని.. 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రంతో దర్శకుడిగా మారారు. రచయితగా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రవికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రవి స్వస్థలం పాలకొల్లు సమీపంలోని సరిపల్లి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story