1931లో కేరళలోని పాలక్కడ్‌లో సేతు మాధవన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు కే.సుబ్రహ్మణ్యం సేతు మాధవన్. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. 1961లో 'జ్ఞాన సుందరి' అనే మలయాళ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత హిందీ, కన్నడ, తమిళ, తెలుగు బాషల్లో 60పైకి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక టాలీవుడ్‌లో 1995లో వచ్చిన 'స్త్రీ' చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. 1991లో 'మరుపక్కమ్' అనే తమిళ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. 2009లో అతన్ని జెస్సీ డేనియల్ అవార్డుతో సత్కరించారు. అనేక సాహిత్య రచనలకు దర్శకత్వం వహించిన సేతుమాధవన్ నాలుగుసార్లు ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర అవార్డును అందుకున్నారు.