ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సంచ‌ల‌న నిర్ణ‌యం

Director Koratala Siva says good bye to social media.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 11:13 AM IST
ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సంచ‌ల‌న నిర్ణ‌యం

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోష‌ల్ మీడియా నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. చివ‌రగా ఆయ‌న మ‌న‌సులోని మాట ట్విట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. 'హలో అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను సోషల్ మీడియాకు దూరంగా వెళ్లాలని భావిస్తున్నాను, ఈ సోషల్ మీడియా ద్వారా నేను అనేక విషయాలను మీ దృష్టికి తీసుకు వచ్చాను కానీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది'' అంటూ ఆయన ప్రకటించారు.

మీడియా మిత్రుల ద్వారా మీతో ట‌చ్‌లోనే ఉంటాను. ఎప్పుడూ మీతో ఇంట‌రాక్ట్ అవుతూనే ఉంటా. మీడియం మారుతుందేమోకానీ మ‌న మ‌ధ్య ఉన్న బంధం మార‌దు అంటూ అని కొర‌టాల ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం కొర‌టాల.. చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుండ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రం త‌రువాత ఎన్టీఆర్ తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నారు.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్‌గా కూడా తర్వలోనే రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు ఇటీవల కొరటాల బర్త్‌డే సందర్భంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికే ముందే తన రిటైర్‌మెంట్‌కు ప్లాన్‌ చేసుకున్నానని, తన డైరెక్షన్‌లో పది సినిమాలు చేసిన అనంతరం దర్శకుడిగా సినిమాలకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైయిపోతానంటూ ఆయన ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచినట్లు వచ్చిన ఈ న్యూస్‌ సినీ ప్రేక్షకులు, ఆయన ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురయ్యారు.

Next Story