నటుడిగా మారిన దర్శకేంద్రుడు.. తొలి సారి కెమెరా ముందుకు.. లుక్ అదుర్స్

Director K Raghavendra Rao turns actor.సినిమాల‌ను అందమైన దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దిన ఘ‌నుడు ద‌ర్శ‌కుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 8:40 AM GMT
నటుడిగా మారిన దర్శకేంద్రుడు.. తొలి సారి కెమెరా ముందుకు.. లుక్ అదుర్స్

సినిమాల‌ను అందమైన దృశ్యకావ్యాలుగా తీర్చిదిద్దిన ఘ‌నుడు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు. ఆయ‌న దర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బాస్ట‌ర్‌లుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. వంద‌కి పైగా చిత్రాల‌కు స్టార్ కెమెరా యాక్ష‌న్ చెప్పిన ఆయ‌న‌.. త‌న 45 ఏళ్ల కెరీర్‌లో ఒక్క‌సారి కూడా కెమెరా ముందుకు రాలేదు. త‌న తోటి దర్శకులు నటులుగా అతిథి పాత్రల్లో కనిపించినా.. ఆయన మాత్రం అసలు ఆసక్తి చూపించలేదు. తొలిసారి ఆయ‌న కెమెరా ముందుకు వ‌చ్చారు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకి పెళ్లిసందD చిత్రం తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల క‌థానాయిక‌. కాగా.. ఈ చిత్రంలో ద‌ర్శ‌కేంద్రుడు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. వ‌శిష్ట‌గా సంద‌డి చేయ‌నున్నారు. రాఘవేంద్రుడికి సంబంధించిన ఓ నిమిషం నిడివిగల ప్రోమో వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి. సుమారు 100కిపైగా చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌న మౌన‌ముని తొలిసారి కెమెరా ముందుకు వ‌చ్చారు అని తెలిపారు.

75 ఏళ్ల రాఘవేంద్రరావుకు ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఆయన డ్రెస్ స్టైల్ సూపర్ అనేలా ఉంది. చేతిలో బాల్ పట్టుకొని, కూల్ గ్లాస్ పెట్టుకొని.. బ్లూ కలర్ జాకెట్, స్తై బ్లూ షర్ట్, ఫ్యాంట్ ధరించి అదరగొట్టారు. ఇన్నాళ్లు సినిమాలు డైరెక్ట్ చేయడమే తెలిసిన రాఘవేంద్రరావుకు నటుడిగా ఇదే తొలి అనుభవం.

Next Story