భార్యతో విడాకులు తీసుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. షాక్‌లో అభిమానులు

Director Bala and Muthumalar get divorced.బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 7:52 AM GMT
భార్యతో విడాకులు తీసుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. షాక్‌లో అభిమానులు

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో విడాకుల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. మొన్న టాలీవుడ్ క‌పుల్ స‌మంత‌-నాగ‌చైత‌న్య‌, నిన్న ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ లు విడిపోయిన‌ సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాలా, అతని భార్య ముత్తుమలర్ (మలార్) డివోర్స్ తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వార్త త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నంగా మారింది. వీరిద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు.

దర్శకుడు బాలా 2004 జూలై 5న మధురైలో ముత్తుమలర్ ను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారై సంతానం. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం నాలుగేళ్ల క్రితం వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ట‌. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రు విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకుని ఇద్ద‌రూ క‌లిసి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు లో విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన న్యాయ‌స్థానం వీరిద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. దీంతో 18 సంవ‌త్స‌రాల వివాహ బంధానికి తెర‌ప‌డింది.

బాలా తెర‌కెక్కించే చిత్రాలకు అటు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటాయి. 'సేతు' (తెలుగులో 'శేషు'), 'నందా', 'పితామ‌గ‌న్' (శివ‌పుత్రుడు), 'నాన్ క‌డ‌వుల్', 'అవ‌న్ ఇవ‌న్' (వాడు వీడు) చిత్రాలు బాలా కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం సూర్య హీరోగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు బాలా.

Next Story
Share it