'మా' ఎన్నిక‌లు.. హీట్ పెంచుతున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ట్వీట్‌

Director Ajay Bhupathi tweet on MAA Elections.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 5:54 AM GMT
మా ఎన్నిక‌లు.. హీట్ పెంచుతున్న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ట్వీట్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. 'మా' అధ్య‌క్ష బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు, ప్యానల్ స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడి చేసుకుంటున్నారు. ఇక మ‌రో మూడు రోజుల్లో మా ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు ఓ వైపు నుంచి ప్ర‌కాశ్‌రాజ్‌, మ‌రోవైపు నుంచి మంచు విష్ణు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్ఎక్స్ 100 చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడిని ఇంకా పెంచేలా ఉంది. త‌న‌కు 'మా' ఎన్నిక‌ల్లో పోటి చేయాల‌ని ఉంద‌ని అన్నాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ఈ థ్రిల్లర్ ఎపిసోడ్లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి 'మా' లో కార్డు తీసుకుని ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేయాలనుంది. ఏదేమైనా, ఈ ఎన్నికల తరువాత 14న మన "మహాసముద్రం" రిలీజ్ ఉంది.. అందరూ తప్పకుండా థియేటర్లలోనే చూడండి!! అని ట్వీట్ చేశాడు.

అనంత‌రం కొద్ది సేప‌టికే.. త‌న‌తో ఇప్పుడే ఓ ద‌ర్శ‌కుడు మాట్లాడాడ‌ని.. 'మా' ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన ప్యాన‌ల్ స‌భ్యుల‌కు ఓటు వేసిన వారికే త‌దుప‌రి సినిమాల్లో క్యారెక్ట‌ర్లు రాస్తానంటూ ఆ ద‌ర్శ‌కుడు త‌న‌తో చెప్పిన‌ట్లు మ‌రో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.ఇలా చెప్పిన స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎవ‌రై ఉంటారా..? అని నెటిజ‌న్లు క‌నుక్కునే ప‌నిలో ఉన్నారు.

ఇక‌.. అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన మ‌హా సముద్రం అక్టోబ‌ర్ 14న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. వీరికి జంట‌గా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామ బ్రహ్మం నిర్మించారు.

Next Story