క్ష‌మాప‌ణ‌లు చెప్పిన 'ఆర్ఎక్స్ 100' ద‌ర్శ‌కుడు

Director Ajay Bhupathi says apology to cini lovers.కార్తీకేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అజ‌య్ భూప‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2021 5:36 AM GMT
క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు

కార్తీకేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ఆర్ఎక్స్ 100' చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. తొలి చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అజ‌య్ భూప‌తి ఇటీవ‌ల 'మ‌హా స‌ముద్రం' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్రేమ‌, వైరం, స్నేహాం వంటి సున్నిత‌మైన అంశాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అజ‌య్ భూప‌తి క‌ల‌ల ప్రాజెక్ట్‌గా ప్ర‌చారం పొందింది. శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ హీరోగా.. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం యావ‌రేజ్ టాక్‌ను అందుకుంది.

స‌న్నివేశాలు ఆస‌క్తికరంగా లేక‌పోవ‌డంతో పాటు పాటలు కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు త‌మ అసంతృప్తిని తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఓ నెటిజ‌న్ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి ట్యాగ్ చేస్తూ.. మ‌హాస‌ముద్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నామ‌ని.. ఎందుకు అలా తీశార‌ని ప్ర‌శ్నించారు. కాగా.. ఈ ట్వీట్‌పై అజ‌య్ భూప‌తి స్పందించారు. మీ అంచ‌నాలు అందుకోలేక‌పోయినందుకు త‌న‌ను క్ష‌మించాల‌ని.. అంద‌రిని సంతృప్తి ప‌రిచే క‌థ‌తో త్వ‌ర‌లోనే ముందుకు వ‌స్తాన‌ని రిప్లై ఇచ్చాడు.

Next Story
Share it