ఆర్ఆర్ఆర్ కోసం ఎఫ్‌3 త్యాగం.. దిల్‌రాజ్ ఏం చెప్పాడంటే..?

Dil Raju Ready to sacrifice for RRR.విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న‌ చిత్రం ఎఫ్ 3.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2022 1:58 PM IST
ఆర్ఆర్ఆర్ కోసం ఎఫ్‌3 త్యాగం.. దిల్‌రాజ్ ఏం చెప్పాడంటే..?

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న‌ చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రాన్ని దిల్‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్రానికి ఓ పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం, ర‌ణం, రుధిరం)' విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డంతో 'ఎఫ్ 3' చిత్రానికి ఇబ్బంది వ‌చ్చే అవ‌కాశం ఉంది. క‌రోనా కార‌ణంగా సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం కూడా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా.. రెండు రిలీజ్ డేట్స్‌ని లాక్ చేసిన‌ట్లు ఆర్ఆర్‌ఆర్ చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దేశవ్యాప్తంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఈ విష‌యంపై దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్‌3ని అవసరమైతే మళ్లీ వాయిదా వేస్తామని ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం అనేది పాన్ ఇండియా చిత్రం అని అన్నారు. అంత పెద్ద ప్రాజెక్టుకి మార్గం చూప‌డం మా బాధ్య‌త అని చెప్పుకొచ్చారు.

Next Story