'యానిమల్' తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘యానిమల్’.

By Medi Samrat  Published on  24 Sept 2023 5:51 PM IST
యానిమల్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత సందీప్ రెడ్డి వంగ చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో బాలీవుడ్ కి వెళ్లి ‘అర్జున్ రెడ్డి’ని ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశాడు అంతే..! రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ చిత్రం మీద అంచనాలు ఒక రేంజిలో ఉండడంతో తెలుగు హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకున్నారు.

దిల్ రాజు తన సినిమాలను బాగా ప్రమోట్ చేస్తుంటాడు. తన సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. టాలీవుడ్‌లో దిల్ రాజు చాలా ఏళ్లుగా అగ్ర నిర్మాతగా ఉన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాక కూడా ఇండస్ట్రీలో తనని నిలబెట్టిన డిస్ట్రిబ్యూషన్ ని వదులుకోలేదు. ఓ వైపు సొంతంగా భారీ సినిమాలని నిర్మిస్తూ ఉన్నా.. డిస్ట్రిబ్యూషన్‌లో కూడా బిజీగా ఉన్నారు. ఆయన నిర్మాతగా ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది.

Next Story