వరుడు కావలెను.. 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్

Digu Digu Digu Naaga lyrical Song out.టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'వరుడు కావలెను'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 1:45 PM IST
వరుడు కావలెను.. దిగు దిగు దిగు నాగ లిరికల్ సాంగ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'వరుడు కావలెను'. పెళ్లిచూపులు ఫేమ్ రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్‌, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలోనే ఈ చిత్రం నుంచి లిరిక‌ల్ సాంగ్ ను విడుద‌ల చేశారు. 'దిగు దిగు దిగు నాగ' అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా శ్రేయ ఘోషల్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. తెలంగాణలో చాలా పాపులర్‌ అయిన ఫోక్‌ సాంగ్‌ దిగు దిగు దిగు నాగ'మాదిరి, చాలా హుసారుగా సాగే పాట ఇది. 'కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. మాస్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే పాట ఇది.

మనసైన వాడి కోసం ఎదురుచూస్తూ ఓ కుర్రమనసు కోరికతో పాడే కొంటె పాట ఇది. బీట్ చాలా హుషారుగా .. ఉత్సాహంగా సాగింది. 'కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి వినేయండి.

Next Story