తమిళ నటుడు ధనుష్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో 'కుబేర' అనే సినిమా చేస్తున్నారు. నటుడు నాగార్జున కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ధనుష్ ఈ సినిమా కోసం మాస్క్ ధరించకుండా ముంబైలోని చెత్త కుప్పల దగ్గర 10 గంటలకు పైగా ఉన్నాడు. ధనుష్ కుబేర సినిమా కోసం ఎంతైనా చేస్తాడని అర్థం అవుతూ ఉంది. కుబేర షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని అతి పెద్ద డంపింగ్ యార్డ్‌లో జరుగుతోందట. షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అదే డంప్యార్డ్లో ఉన్నాడట ధనుష్. దాదాపు 10 గంటల ఆటు అక్కడి దుర్వాసనని భరిస్తూ అక్కడే ఉన్నాడట. సన్నివేశాలు సహజంగా రావడానికి కనీసం ముక్కుకి మాస్క్ కూడా ధరించలేదని తెలుస్తోంది.
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తూ ఉంది. నాగార్జున పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల గ్లింప్స్ వీడియోతో విడుదల చేశారు. ధనుష్ తన సినిమాలలో పాత్రలను చాలా రియలిస్టిక్ గా చూపించడంలో పేరు తెచ్చుకున్నాడు. కుబేర సినిమా కోసం కూడా దానిని పునరావృతం చేస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ధనుష్ ఇటీవల నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం సంక్రాంతి సీజన్‌లో విడుదలై మంచి విజయం సాధించింది.