సమంత ఆ టాటూ తీసేసిందా.?

నటి సమంత రూత్ ప్రభు తన మాజీ భర్త నాగ చైతన్యతో ముడిపడి ఉన్న టాటూలను తొలగించినట్లు తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 7 Jun 2025 8:30 PM IST

సమంత ఆ టాటూ తీసేసిందా.?

నటి సమంత రూత్ ప్రభు తన మాజీ భర్త నాగ చైతన్యతో ముడిపడి ఉన్న టాటూలను తొలగించినట్లు తెలుస్తోంది. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అభిమానులు ఆమె వీపుపై ఉన్న 'యే మాయ చేసావే' టాటూ కనిపించడం లేదని కామెంట్లు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె చైతన్యను వివాహం చేసుకున్నప్పుడు ఆ ఇనీషియల్స్ ను టాటూగా వేసుకున్నారు.

సమంత తన కొత్త వెంచర్‌ను ప్రకటించిన తర్వాత ఓ వీడియో క్లిప్ ను అప్లోడ్ చేసింది. ఆ వీడియో క్లిప్‌లో, చాలా మంది వినియోగదారులు ఆమె వీపుపై "YMC" ('యే మాయ చేసావే') టాటూ లేకపోవడాన్ని గుర్తించారు. వీడియోలో, సమంత కెమెరా వైపు నడుస్తూ లెన్స్‌పై "దాచడానికి ఏమీ లేదు" అని రాయడం చూడొచ్చు.

సమంత తన తొలి సినిమా 'యే మాయ చేసావే' (2010) కి గుర్తుగా ఈ పేరులోని ఇనీషియల్స్ టాటూగా వేసుకుంది, ఈ సినిమాతో ఆమె కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా ఆమెను నాగ చైతన్యకు పరిచయం చేసింది. తరువాత ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టి 2017 లో వివాహం చేసుకున్నారు. అయితే వారు 2020 లో విడిపోయారు. 2021లో వారి విడాకులు ఖరారు అయ్యాయి.

Next Story