ఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
తెలుగు బుల్లితెరలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య
By అంజి Published on 1 May 2023 6:28 AM ISTఢీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
తెలుగు బుల్లితెరలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్‌లోని నెల్లూరు క్లబ్ హోటల్‌లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు చైతన్య సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్లకు సారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చినవాళ్లు ఇచ్చిన ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాని.. చాలా ట్రై చేసినా అవ్వడం లేదని అతడు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఒక అప్పును తీర్చడానికి.. మరో తప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని తెలిపాడు. ఢీ ప్రోగ్రాం లో పేరు వచ్చింది కానీ.. సంపాదన తక్కువగా ఇస్తున్నారనీ వెల్లడించాడు. జబర్దస్త్ ప్రోగ్రాంలో ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని అన్నాడు. నేమ్, ఫేమ్ ఇచ్చిన ఢీ షోకు ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. శనివారం వరల్డ్ డాన్స్ డే సందర్భంగా ఇక్కడి టౌన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన చైతన్య.. ఆదివారం సూసైడ్ చేసుకోవడంతో విషాద చాయలు అలుముకున్నాయి.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.