మ‌దురై దంపతులకు షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే రూ.10కోట్లు క‌ట్టాల్సిందే

Dhanush issues legal notice against couple claiming him to be their biological son.హీరో ధ‌నుష్ త‌మ కుమారుడేన‌ని అంటూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 5:58 AM GMT
మ‌దురై దంపతులకు షాక్‌ ఇచ్చిన ధనుష్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే రూ.10కోట్లు క‌ట్టాల్సిందే

హీరో ధ‌నుష్ త‌మ కుమారుడేన‌ని అంటూ మ‌ధురై వేలూరికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు నాలుగేళ్లుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. సినిమాల్లో న‌టించాల‌నే ఉద్దేశ్యంతో ఇంటి నుంచి చిన్నత‌నంలోనే పారిపోయాడ‌ని ఆ వృద్ధ‌దంప‌తులు ప‌లు సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. త‌మ జీవ‌నాధారం కోసం నెల‌కు రూ.60 వేలు ఇప్పించాలంటూ ఆ దంప‌తులు కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో మ‌ద్రాసు హైకోర్టు హీరో ధ‌నుష్‌కు స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ ఆరోప‌ణ‌ల‌తో విసిగిపోయిన ధ‌నుష్‌, ఆయ‌న తండ్రి క‌స్తూరి రాజా తాజాగా ఆ దంప‌తుల‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఇంత‌కాలంగా త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ఇక‌నైనా పుల్‌స్టాప్ పెట్టాల‌ని కోరారు. ఇంత‌కాలం చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని పేర్కొంటూ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఓ స్టేట్‌మెంట్ విడుద‌ల చేయాల‌న్నారు. ఈ విధంగా చేయకపోతే రూ.10కోట్లకు పరువునష్టం దావా వేస్తానంటూ క‌దిరేశ‌న్ దంప‌తుల‌కు ధ‌నుష్ త‌న లాయ‌ర్ ద్వారా నోటీసులు పంపారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల త‌న భార్య ఐశ్వ‌ర్య‌తో ధ‌నుష్ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ధ‌నుష్.. ది గ్రే మ్యాన్‌, నానే వ‌రువెన్‌, తిరుచితంబ‌లం చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

Next Story
Share it