మాజీ భార్యను స్నేహితురాలు అన్న ధ‌నుష్‌.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్లు

Dhanush calls EX Wife Aishwaryaa Rajinikanth ‘friend’.కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య దంప‌తులు ఇటీవ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2022 4:55 AM GMT
మాజీ భార్యను స్నేహితురాలు అన్న ధ‌నుష్‌.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్లు

కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య దంప‌తులు ఇటీవ‌ల విడిపోయిన సంగ‌తి తెలిసిందే. 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవ‌డాన్ని ఇప్ప‌టికీ కూడా అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వీరి స‌న్నిహితులు, అభిమానులు వీరు క‌లిస్తే బాగుంటుంద‌ని ఎదురుచూస్తున్నారు. అయితే.. వీరిద్ద‌రు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఇక వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన త‌రువాత ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీ అయిపోయారు.

ప్ర‌స్తుతం ధ‌నుష్ వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా.. ఐశ్వ‌ర్య ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తోంది. ప‌య‌ని పేరుతో ఐశ్వ‌ర్య రూపొందించిన ఓ మ్యూజిక్ సింగిల్‌ను సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ విడుద‌ల చేశారు. తెలుగులో సంచారి పేరిట ఈ వీడియోను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జినీకాంత్ సోష‌ల్ మీడియాలో త‌న కుమారైకు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. తొమ్మిది సంవ‌త్స‌రాల అనంత‌రం మ‌ళ్లీ ద‌ర్శ‌కురాలిగా అడుగుపెట్ట‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అదేవిధంగా మోహ‌న్‌లాల్ స‌హా ప‌లువురు న‌టీన‌టులు ఐశ్వ‌ర్య‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఈ క్రమంలో విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్‌ చేశాడు ధనుష్‌. ఐశ్వ‌ర్య‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ధ‌నుష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ గా మారింది. నా స్నేహితురాలు ఐశ్వ‌ర్య‌కి అభినంద‌న‌లు. దేవుడి ఆశిస్సులు అంటూ ఆ వీడియో లింక్‌ను ట్వీట్ చేశాడు. కాగా.. ధ‌నుష్ తీరుపై కొంద‌రు నెటీజ‌న్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. విడాకులు అనంత‌రం కూడా ఐశ్వ‌ర్య త‌న సోష‌ల్ మీడియా ప్రొపైల్ పేరు ప‌క్క‌న ధ‌నుష్ పేరును అలాగే ఉంచింది. అయితే.. ధ‌నుష్ మాత్రం ఐశ్వ‌ర్య‌ను స్నేహితురాలు అని పిల‌వ‌డం న‌చ్చ‌లేద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it