అఫీషియ‌ల్.. ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

Dhanush and sekhar kammula project conformed.కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2021 11:41 AM IST
అఫీషియ‌ల్.. ధ‌నుష్‌తో శేఖ‌ర్ క‌మ్ముల చిత్రం

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ త్రిభాషా చిత్రానికి రూపకల్పన చేయడం షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దివంగత సునీతా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సోనాలి నారంగ్ ప్రకటించారు.

రెండు నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న ధ‌నుష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గానే కాక గ్లోబ‌ల్ స్టార్‌గా స‌త్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. హాలీవుడ్‌లో 'ది గ్రేమ్యాన్‌' చిత్రంలో న‌టిస్తున్నారు. అవెంజర్స్ దర్శకులు రస్సో బ్రదర్స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కులు. కాగా.. ధనుష్ న‌టించిన తాజా చిత్రం జగమే తంత్రం (జగమే తందిరం-తమిళ్) నేటి మ‌ధ్యాహ్నాం నెట్‌ఫిక్స్‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా రస్సో బ్రదర్స్ అతడికి శుభాకాంక్షలు చెప్పడం అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ఇక శేఖర్ క‌మ్ముల విష‌యానికి వ‌స్తే ఆయ‌న తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరీ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story